![]() |
![]() |

వేసవి మొదలైంది.. ఇక మనుషులు లీటర్ల లీటర్ల నీళ్ళు, కొబ్బరినీళ్ళు, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఏసీ కోసం చల్లని గాలి కోసం ప్రాకులాడుతుంటారు. మరి జంతువుల పరిస్తితేంటి.. అవి పడుకునే నేల కూడా హీటెక్కిపోతుంది. అందుకే వాటి గురించి ఆలోచించిన యాంకర్ జాన్సీ ఓ వినూత్నమైన ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మరి అదేంటో ఓసారి చూద్దాం.
అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు ఇలా రకరకాల చెట్లు ఉన్న వారు ఆ చెట్ల నుండి రాలిన ఎండుటాకులని చెత్తలో పడేస్తుంటారు. అయితే వాటిని అలా పడేయకుండా అన్నింటిని పోగు చేసి... వీధిలో, రోడ్ల మీద తిరిగే కుక్కలకి లేదా ఇతర జంతువులు కూర్చోడానికి చాపలాగా చేయాలని చెప్పింది. జాన్సీ కొన్ని ఎండిన అరటిఆకులని, పడేసిన ఆకులన్నింటిని పోగుచేసి వీధిని కాసుకొని కూర్చొనే కుక్కల కోసం , వాటికి కాస్త చల్గగా ఉండేలా ఏర్పాటు చేసింది. " Someone's waste is someone's TREASURE ". ఎండుటాకులని కాల్చొద్దు అవి ప్రకృతి యొక్క స్థితిని బ్యాలెన్స్ చేసే ఓ ఫార్ములా అని మంచి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇప్పుడు తను చేసిన ఈ పని కొత్తతరానికి కనువిప్పులా.. ఓ కొత్త ఆలోచనని రేకెత్తించేలా ఉంది. అందుకే తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లు ఫిధా అయ్యారు.
ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కొంతకాలం క్రితం రిలీజైన సలార్ లో ఆమె ఓబులమ్మగా నటించి మెప్పించారు. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక తను ఇన్ స్టాగ్రామ్ లో 290K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. తను ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మొదట 'సొంతం' మూవీలో సునీల్ తో కలిసి చేసిన ఆ కామెడీ వీడియోలు, మాటలు, పంచ్ లు అన్నీ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ లో కన్పిస్తుంటాయి.
![]() |
![]() |